శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
పట్టణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురయింది
పట్టణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురయింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మికి వరస అవమానాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీలక్ష్మి బొకే ఇస్తున్నప్పుడు ఆయన నిరాకరించారు. శ్రీలక్ష్మి ఇచ్చిన బొకేను చంద్రబాబు తీసుకోలేదు. మిగిలిన ఐఏఎస్ అధికారుల నుంచి బొకేలను తీసుకున్న చంద్రబాబు శ్రీలక్ష్మి నుంచి మాత్రం పుష్పగుచ్చం తీసుకోకుండా పక్కన పెట్టారు.
మంత్రి నారాయణ కూడా...
ఈరోజు కూడా మంత్రిగా నారాయణ బాధ్యతలను స్వీకరిస్తున్న సమయంలో పట్టణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి నారాయణ మొదటి సంతకం చేయాల్సిన ఫైళ్లను నారాయణ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. అయితే నారాయణ మాత్రం సంతకాలు ఇప్పుడు అవసరం లేదని, తర్వాత చూద్దామని చెబుతూ ఆమె తీసుకొచ్చిన ఫైలుపై సంతకం పెట్టకుండానే బాధ్యతలను స్వీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శ్రీలక్ష్మిని పట్టణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తప్పించి జీఏడీకి పంపుతారన్న ప్రచారం ఐఏఎస్ వర్గాల్లో వ్యక్తమవుతుంది.