Chandrababu : నేడు పింఛను పంపిణీకి పల్నాడుకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీని ఆయన ప్రారంభించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయన పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పర్యటించనున్నారు. అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10.30 గంటలకు ఆయన తన నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లాకు చేరుకుంటారు. అనంతరం యల్లమంద గ్రామానికి చేరుకుని దాదాపు అరగంట సేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
పింఛన్ల పంపిణీ చేసి...
లబ్దిదారుడు సురేష్ ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం గంట సేపు పల్నాడు జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేస్తారు. అనంతరం అక్కడి నుంచి 1.45 గంటలకు కోటప్పకొండకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయన ఉండవల్లి నివాసానికి బయలుదేరి వస్తారు. ఈ కార్యక్రమం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ భద్రతను సీఎం పర్యటన కోసం ఏర్పాటు చేశారు.