బెజవాడ వాసులకు హ్యాపీ న్యూస్ ..రెండురోజుల పాటు ?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకలకు మద్యం షాపుల సమయం పెంచింది
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకలకు మద్యం షాపులకు సమయం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు, రేపు మద్యం దుకాణాలు రాత్రి ఒంటి గంట వరకూ తెరిచే ఉంటాయని పేర్కొంది. ప్రధానంగా బెజవాడ, విశాఖపట్న వంటి నగరాల్లో ఈ న్యూ ఇయర్ వేడుకలకుమద్యం అమ్మకాలు జోరుగా జరిగే అవకాశాలున్నాయి.
అర్ధరాత్రి ఒంటి
గంట వరకూ...
అందుకోసమే రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకూ మద్యం అమ్మకాలు జరిగే అవకాశముంది. కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయే అవకాశముందని భావించిన ప్రభుత్వం అంచనా వేసి మరీ సమయాలను పెంచింది. మద్యం విక్రయాలు భారీగా పెరుగుతాయని భావించి అన్ని బ్రాండ్ల మద్యాన్ని ఇప్పటికే వైన్ షాపులకు సరఫరా చేసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now