ట్రోల్ చేసిన వారిపై క్రిమినల్ కేసు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తులను ట్రోల్ చేసిన వారిపై చర్యలకు రంగం సిద్ధమయింది

Update: 2023-09-26 07:05 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తులను ట్రోల్ చేసిన వారిపై చర్యలకు రంగం సిద్ధమయింది. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. హైకోర్టుతో పాటు దిగువ కోర్టు కు చెందిన న్యాయమూర్తులను కూడా దూషిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పాటు న్యాయమూర్తిని దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సయితం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నిఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

న్యాయమూర్తులను...
అయితే దీనికి సంబంధించి క్రిమినల్ కంటెప్ట్ కేసును అడిషనల్ అడ్వొకేటజ్ జనరల్ శ్రీరామ్ డివిజనల్ బెంచ్ ముందు ప్రస్తావించారు. న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషించారని ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఏపీ హైకోర్టులో కోర్టు థిక్కార పిటీషన్ ను సయితం ఆయన దాఖలు చేశారు. అయితే ఈ కేసును రేపు విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు సయితం కోరుతున్నారు.


Tags:    

Similar News