ఇప్పటి వరకూ వందకోట్లు స్వాధీనం చేసుకున్నాం

ఏపీలో 100 కోట్ల పైబడి నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

Update: 2024-04-11 11:53 GMT

ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 100 కోట్ల విలువకు పైబడి నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందదన్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచడం జరిగిందన్నారు.

చెక్ పోస్టుల వద్ద నిఘా...
అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని అనేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఈడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువైలన నగదుతో పాటు లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News