అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్ కు ఓకే

అమరావతిలో బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Update: 2024-12-03 02:24 GMT

అమరావతిలో అమరావతిలో బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభ్యర్థన మేరకు హైదరాబాద్ తరహాలో రాజధాని అమరావతిలోనూ బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు.

పదిహేను ఎకరాలు కేటాయింపు...
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 15 ఎకరాల భూమిని కేటాయించింది. తొలి దశలో 1300 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతారు. తర్వాత మరో వెయ్యి పడకలకు ఈ ఆసుపత్రిని విస్తరించే అవకాశముంది. రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ రావడంతో క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులకు ఊరట కల్గించే విషయంగా చూడాలి.


Tags:    

Similar News