Ration Rice : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ లో బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం ఆరుగురి బృందంతో సిట్ ను ఏర్పాటు చేసింది. మొత్తం 13 ఎఫ్ఐఆర్ ల ఆధారంగా సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజిలాల్ ను నియమింంది. ఆయన తోపాటు ఇద్దరు ఐపీఎస్ లు, నలుగురు డీఎస్పీ అధికారులను సిట్ లో రాష్ట్ర ప్రభుత్వం నియమిచింది.
బియ్యం అక్రమ రవాణాకు...
ఆంధ్రప్రదేశ్ లో బియ్యం అక్రమ రవాణాకు గత ప్రభుత్వం పాల్పడిందని,లక్షల కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసిందని ఆరోపణలున్నాయి. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారని, ఇందులో నలుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బియ్యం అక్రమ రవాణాపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సిట్ సభ్యులుగా సీఐడీ ఎస్సీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్థన్, గోవిందరావు, డీఎస్పీలు బాలసుందరరావు, రత్తయ్యలను ప్రభుత్వం నియమించింది.