అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో ఆవిష్కృతమైన అద్భుతం..
శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు 11వ శతాబ్ధంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో అప్పటి ఆర్కిటెక్చర్లు తీర్చిదిద్దిన మెళకువలే..
శ్రీకాకుళం : అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అశేష భక్తజనంతో పూజలందుకుంటున్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించారు. ఆలయ గర్భగుడిలో కొలువుదీరిన స్వామివారి మూలవిరాట్ ను ఉదయించే లేలేత సూర్య కిరణాలు ఏకధాటిగా ఆరునిమిషాల పాటు స్పృశించాయి. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం కి స్థాన చలనం చెందిన సమయంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది.
శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు 11వ శతాబ్ధంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో అప్పటి ఆర్కిటెక్చర్లు తీర్చిదిద్దిన మెళకువలే ఈ అద్భుతానికి నిదర్శనం. ఏడాదికి రెండు పర్యాయాలు మార్చి 9, 10 తేదీల్లోను, అక్టోబర్ నెల 2, 3 తేదీల్లోనూ ఈ సూర్య కిరణాలు స్వామివారి పాదాలను స్పర్శించడం జరుగుతుంది. మార్చి నెలలో సూర్యుడు దక్షిణాయనం నుంచి నుంచి ఉత్తరాయణం కి, అక్టోబర్ నెలలో ఉత్త రాయణం నుంచి దక్షణాక్షిణాయనానికి స్దాన చలనం చెందే ఈ రెండు రెండు రోజుల్లో ఉదయించే సూర్య కిరణాలు ఆలయ ప్రాంగణంలో ఉన్న గాలి గోపురం, అనీ వెట్టు మండపం, ఆలయ ముఖ ద్వారం అంగట్లో ఉన్న ధ్వజ స్తంభాన్ని దాటుకుని గర్భగుడిలో శాలిగ్రామం శిలాతో చేసిన స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకూ తాకుతాయి.