వైఎస్ వివేకా కేసు : సుప్రీం సీరియస్
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టులో న్యాయమూర్తి ప్రశ్నించారు
సుప్రీంకోర్టులో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ వేశారు. దర్యాప్తు అధికారి రామ్‍సింగ్‍ను మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి బాగానే పనిచేస్తున్నారని సీబీఐ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టులో న్యాయమూర్తి ప్రశ్నించారు.
సీల్డ్ కవర్ లో...
వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణలో పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్‍లో నివేదిక ఇవ్వాలని సుపీంకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించింది.