Breaking : చంద్రబాబు క్వాష్ పిటీషన్ వాయిదా

సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది

Update: 2023-10-10 08:43 GMT

సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. వచ్చే శుక్రవారానికి విచారణను వాయిదా వేసింది. గత మూడు రోజుల నుంచి చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తరుపున హరీశ్ సాల్వే తన వాదనలు వినిపించారు.

శుక్రవారం మధ్యాహ్నానికి...
అదే సమయంలో సీఐడీ తరుపున ముకుల్ రోహత్గీ వాదనలు చేశారు. 17 ఎ చుట్టూనే వాదనలు కొనసాగాయి. అయితే ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ధర్మాసనం వాయిదా వేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News