శ్రీశైలంలో చీఫ్ జస్టిస్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రెండో రోజు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయమే స్వామివారిని దర్శించుకున్నారు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు రెండో రోజు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయమే స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్వీరమణ దంపతులతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ దంపతులు కూడా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు దేవస్ధానం వేద పండితులు స్వాగతం పలికారు. మహా మంగళహారతి సేవలో పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు...
మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు చేశారు. అమ్మవారికి కుంకుమార్చన సేవలో కూడా వారు పాల్గొన్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు కంచిమఠంలో జరిగే చండీ యాగంలో కూడా పాల్గొన్నారు. నిన్న రాత్రి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైలానికి వచ్చారు.