జస్టిస్ ఎన్వీరమణ రాక.. సొంత గ్రామంలో?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. తన స్వగ్రామానికి రానున్నారు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రెండేళ్ల తర్వాత జస్టిస్ ఎన్వీరమణ తన స్వగ్రామానికి రానున్నారు. కృష్ణాజిల్లాలోని పొన్నవరం గ్రామానికి ఆయన దాదాు రెండు దశాబ్దాల తర్వాత రానున్నారు. దీంతో జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు గ్రామస్థులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ఎడ్లబండి మీద ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే గ్రామంలో జస్టిస్ ఎన్వీరమణ అభినందన సభను ఏర్పాటు చేశారు.
తొలిసారి రానుండటంతో....
చీఫ్ జస్టిస్ గా పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి సొంత గ్రామానికి వస్తున్నారు. జస్టిస్ ఎన్వీరమణకు స్వాగతం పలికేందుకు గరికపాడు చెక్ పోస్టు వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్నారు. పొన్నవరంలో జస్టిస్ ఎన్వీరమణ నాలుగు గంటలు గడిపిన అనంతరం గుంటూరు చేరుకుని అక్కడ జస్టిస్ లావు నాగేశ్వరరావు నివాసానికి వెళతారు. రాత్రి వరకూ అక్కడే ఉండి రాత్రి బస నోవాటెల్ లో చేస్తారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.