మేం విచారించలేం.. జోక్యం చేసుకోలేం
జీవో నెంబరు 1 పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది;
జీవో నెంబరు 1 పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు పేర్కంది. జీవో నెంబరు 1ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
హైకోర్టు ధర్మాసనం...
దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై తాము విచారించలేమని పేర్కొంది. ఈ నెల 23వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. డివిజన్ బెంచ్ ముందు ఇరు వర్గాలు తమ వాదనలను వినిపించుకోవచ్చని పేర్కొంది.