Breaking : సుప్రీంకోర్టు ధర్మాసనం వేర్వేరు అభిప్రాయాలు.. చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది

Update: 2024-01-16 07:55 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై తీర్పు చెప్పింది. స్కిల్ డెెవలెప్ మెంట్ స్కామ్ కేసులో వేసిన క్వాష్ పిటీషన్ పై ప్రతికూలంగా ఒకరు, అనుకూలంగా ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిన్ అనిరుధ్ బోస్, బేలా త్రేవేది ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించింది. ఈ కేసును విడివిడిగా తీర్పు చదవారు 17 ఎ నిబంధన చంద్రబాబు నాయుడుకు వర్తించదని తెలిపింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్దాయి. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టుకు ఉందని తెలిపారు జస్టిస్ అనిరుధ్ బోస్. చంద్రబాబుకు 17ఏ వర్తించదని త్రివేది, వర్తిస్తుందని అనిరుధ్ తెలిపారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ కు ఈ కేసును బదలీ చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం మరొక బెంచ్ కు ఈ కేసును బదిలీ చేసే అవకాశముంది. దీనిపై మళ్లీ విచారణ జరిగి తీర్పు వెలువడటానికి మరికొంత సమయం పడుతుంది. 

అరెస్టయిన నేపథ్యంలో...
చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో సీఐడీ అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17 ఎ కింద గవర్నర్ నుంచి అనుమతి తీసుకోలేదని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు నాయుడు వేసిన పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును కొట్టివేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబరు 17న తీర్పు ను వాయిదా వేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు ఈ కేసును బదిలీ చేశారు. దసరా, శీతాకాల సెలవుల వల్ల ఈ తీర్పు ఎప్పటికప్పడు వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు తీర్పు వెలువడింది. ఈ తీర్పు కోసం రెండు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో బెయిల్ పై ఉన్నారు.


Tags:    

Similar News