నాపై ఆరోపణలు పరమ టైమ్ వేస్ట్

తనపై ఆరోపణలు చేయడం టైమ్ వేస్ట్ అని సస్పెండైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు

Update: 2022-03-21 12:31 GMT

తనపై ఆరోపణలు చేయడం టైమ్ వేస్ట్ అని సస్పెండైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. పెగాసస్ స్పైవేర్ ను 2019 మే వరకూ ఏ ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేయలేదని ఆయన చెప్పారు. ప్రజల భయాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. పెగాసస్ పై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడానికే తాను మీడియా ముందుకు వచ్చానని చెకపపారు. అప్పటి డీజీపీ కూడా పెగాసస్ ను కొనుగోలు చేయలేదని చెప్పారన్నారు. తాను ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని ఆయన అన్నారు. అసత్యాలు, అసంబద్ధ వాదనలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టవద్దని ఆయన కోరారు. అన్నింటికీ తనకు ముడిపెట్టడం సరికాదన్నారు. మే 2019 తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదన్నారు.

నన్ను ఇరికించేందుకు....
తనను కేసుల్లో ఇరికించేందుకు కొందరు అధికారులు తప్పుడు పత్రాలతో విఫలయత్నాలు చేశారని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఆ అధికారుల ప్రయత్నాలు రుజువులతో సమర్పించినా ఇంతవరకూ వారిపై చర్యలు లేవని చెప్పారు. తన సస్పెన్షన్ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పారు. తన వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏబీ చెప్పారు. తనకు వ్యతిరేకంగా రాసిన కొన్ని పత్రికలపై పరువు నష్టం దావా వేసేందుకు ప్రభుత్వ అనుమతిని కోరానని చెప్పారు. 30 ఏళ్ల పాటు దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేశానని చెప్పారు.


Tags:    

Similar News