TDP : ఉండవల్లి శ్రీదేవి కామెంట్ విన్నారా? వింటే షాక్ అవుతారు
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన అసంతృప్తిని తెలుగుదేశం పార్టీపై వ్యక్తం చేశారు
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన అసంతృప్తిని తెలుగుదేశం పార్టీపై వ్యక్తం చేశారు. టీడీపీ హైకమాండ్ పై ఆమె సోషల్ మీడియాలో తన అసహనాన్ని, అసంతృప్తి వ్యక్తం చేశారు. బాపట్లను ట్యాగ్ చేస్తూ కత్తి సింబల్ పెట్టి వెన్నుపోటు పొడిచారంటూ ఉండవల్లి శ్రీదేవి పోస్టు పెట్టారు. రాజకీయాలు ఎలాం ఉంటాయో? ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమయిందని ఉండవల్లి శ్రీదేవి అన్నారు.
గత ఎన్నికల్లో...
2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆమె వైద్య వృత్తిలో ఉండగా జగన్ ఆమెకు పార్టీ టిక్కెట్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఆమెను వైసీపీ సస్పెండ్ చేసింది. దీంతో ఆమె టీడీపీలో చేరారు. ఆమె తనకు బాపట్ల ఎంపీ టిక్కెట్ ఇస్తారని భావించారు. అది దక్కకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి టీడీపీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.