జగన్ వేరే చోట సీటిస్తామన్నారు.. నేనెందుకు?

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని ఆమె చెప్పారు

Update: 2023-03-23 15:08 GMT

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని ఆమె చెప్పారు. తన నియోజకవర్గంలో 2019 నుంచి అసంతృప్తి ఉందని, అంత మాత్రాన తాను పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే వ్యక్తిని కాదన్నారు. తాను రాజకీయ విలువలను పాటిస్తానని చెప్పారు. నిజం నిలకడమీద తెలుస్తుందని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఆమె తెలిపారు. తాను పార్టీకి కట్టుబడి ఉన్నానని ఆమె చెప్పారు.

జగన్ ను కలిసినప్పుడు...
ఈరోజు ఉదయమే తాను ముఖ్యమంత్రి జగన్ ను కలిశానని ఆమె చెప్పారు. రాజధాని ప్రాంతం కావడంతో వచ్చే ఎన్నికల్లో వేరే చోట తనకు సీటు ఇస్తారని జగన్ హామీ ఇచ్చారని ఆమె అంటున్నారు. దళిత మహిళ అనే తనపై అభాండాలు వేస్తున్నారన్నారు. తాను వైసీపీ అభ్యర్థికే ఓటు వేశానని అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించే తనను జగనన్న ఉదయమే దీవించారని, నవ్వమని కూడా తనను ప్రోత్సహించారని ఆమె తెలిపారు. తన పాపను కూడా జగన్ దీవించారని ఆమె తెలిపారు.


Tags:    

Similar News