పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లాగా తాడిపత్రిని స్పెషల్ జోన్ గా ప్రకటించాలన్నారు

Update: 2023-01-30 07:25 GMT

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లాగా తాడిపత్రిని స్పెషల్ జోన్ గా ప్రకటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులపై ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నా పోలీసు అధికారుల సంఘం కూడా పట్టించుకోవడం లేదని పెద్దారెడ్డి అన్నారు. తాడినత్రిలో పోలీసులు నేతల మధ్య కార్నర్ గా మారారన్నారు.

పోలీసులు భయపెడుతూ...
జేసీ బ్రదర్స్ కు పోలీసులు భయపడుతున్నారన్నారు. పోలీసులను బ్లాక్ మెయిల్ చేయాలని జేసీ బ్రదర్స్ భావిస్తున్నారని తెలిపారు. జేసీ బ్రదర్స్ ను కట్టడి చేయాలంటే ప్రత్యేక పోలీసు అధికారులను నియమించాల్సిందేనని పెద్దారెడ్డి అభిప్రాయపడ్డారు. జేసీ బ్రదర్స్ ఆటలు కట్టించేది తాను మాత్రమేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకాలు ప్రజలకు అందుతుంటే జేసీ బ్రదర్స్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన మండి పడ్డారు.


Tags:    

Similar News