జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ .. జగనే మంచోడంటూ

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు;

Update: 2025-01-03 03:20 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చాలా వరకూ నయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆరోజు జగన్ తన బస్సులను నిలబెట్టాడని, అయితే ఈరోజు అదే బస్సులను తగలపెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినా తాను ఎవరికీ భయపడబోనని ఆయన అన్నారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు.

కోట్ల రూపాయలు నష్టపోయాయని...
అప్పుడే కోట్ల రూపాయలు నష్టపోయాయనని, ఇప్పుడు నష్టం వచ్చినా పెద్దగా భయపడేది లేదని అన్నారు. తాను ఎవరికీ భయపడి తలొగ్గేది లేదని అన్నారు. వైసీపీ గవర్నమెంట్ లో జగన్ తన బస్సులను ఆపితే, బీజేపీ ప్రభుత్వంలో తన బస్సులను తగులపెట్టించారని ఆయన ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం గా మారాయి.


Tags:    

Similar News