Tdp, Janasena : నేడు ఉమ్మడి మేనిఫోస్టో కమిటీ భేటీ

టీడీపీ, జనసేన నేతలు నేడు ఉమ్మడి మేనిఫోస్టోను రూపొందించడానికి సమావేశం కాబోతున్నారు.

Update: 2023-11-13 03:19 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కూడా సయమం దగ్గర పడుతుంది. పెద్దగా సమయం లేకపోవడంతో ఇప్పటికే అధికారికంగా పొత్తు ఖరారు కావడంతో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫోస్టోను వీలయినంత త్వరగా రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే టీడీపీ ఒక మేనిఫోస్టో ను విడుదల చేసింది. ఈసారి విడుదల చేసే మేనిఫోస్టో ఉమ్మడిగా ఉంటుంది. ఇందుకోసం నేడు ఇరు పార్టీల నేతలు సమావేశమవుతున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా మేనిఫోస్టో ను రూపొందించాలన్న నిర్ణయంతో ఉన్నారు.

రూపకల్పన కోసం...
ఉమ్మడి మేనిఫోస్టో రూపకల్పన కోసం టీడీపీ, జనసేన సభ్యులను నియమించింది. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి సభ్యులుగా ఉండగా, జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ లు సభ్యులుగా ఉన్నారు. వీరంతా నేడు విజయవాడలోని ఎన్టీఆర్ భనవ్ లో సమావేశమై ఉమ్మడి మేనిఫోస్టో పై చర్చించనున్నారు. పవన్ కల్యాణ్ సూచించిన కొన్ని పథకాలను కూడా ఇందులో చర్చించన్నారు. ఈ కమిటీ చర్చించిన తర్వాత చంద్రబాబు, పవన్ తోనూ సమావేశమై మేనిఫోస్టోపై ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది.


Tags:    

Similar News