జంగారెడ్డిగూడెం వెళ్లినా.. చంద్రబాబుకు అక్కడ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జంగారెడ్డిగూడెం బయలుదేరారు/ జిల్లాకు వచ్చిన బాబుకు క్యాడర్ ఘన స్వాగతం పలికింది;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జంగారెడ్డిగూడెం బయలుదేరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు పార్టీ క్యాడర్ ఘన స్వాగతం పలికింది. దెందులూరు నియోజకవర్గం సోమవరప్పాడు వద్ద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో పార్టీ క్యాడర్ చంద్రబాబుకు అఖండ స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబు జంగారెడ్డిగూడెం బయలుదేరి వెళ్లారు.
మరణించిన వారి కుటుంబ సభ్యులను...
జంగారెడ్డి గూడెంలో ఇటీవల వరసగా మరణించిన వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించనున్నారు. అక్రమ మద్యం తాగి మరణించారని టీడీపీ ఆరోపిస్తుంది. జంగారెడ్డిగూడెంలో జరిగిన 18 మరణాలు ప్రభుత్వ హత్యలేనని టీడీపీ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన జంగారెడ్డిగూడెంలో కొంత ఉద్రిక్తతను నెలకొనేలా చేసింది. మృతుల కుటుంబాలను చంద్రబాబుతో కలవనివ్వకుండా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.