Chandrababu : నేడు సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సీఐడీ కార్యాలయానికి రానున్నారు. పూచీకత్తును దర్యాప్తు అధికారికి ఇవ్వనున్నారు;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సీఐడీ కార్యాలయానికి రానున్నారు. పూచీకత్తు ఇచ్చేందుకు ఆయన సీఐడీ కార్యాలయానికి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్ స్కాం, ఇసుక కేసుల్లో సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.
పూచీకత్తు సమర్పించడానికి...
ఇటీవల హైకోర్టు మూడు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్యాప్తు అధికారికి పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో చంద్రబాబు నేడు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారని తెలిసింది. వారం రోజుల్లోగా పూచికత్తును దర్యాప్తు అధికారికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశం మేరకు ఆయన స్వయంగా సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.