Chandrababu : నేడు తిరుమలకు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు వెళ్లనున్నారు;
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు వెళ్లనున్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రికి చంద్రబాబు అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో...
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి తిరుమలకు వస్తుండటంతో అధికారులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కూటమి విజయం సాధించడంతో ఆయన మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు బయలుదేరి వెళుతున్నారు.