జగన్ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్
వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గాల్లో తిరిగితే ప్రజల సమస్యలు తెలియన్నారు
వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గాల్లో తిరిగితే ప్రజల సమస్యలు తెలియన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ప్రజల కష్టాలు తెలుస్తాయని అన్నారు. జగన్ మాత్రం కాలికి మట్టి అంటకుండా గాల్లో తిరుగుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద భాదిత ప్రాంతాల నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు ఆరు జిల్లాల్లో 550 పైగా గ్రామాల్లో వరద ప్రభావం ఉందని చెప్పారు.వరద బాధితులకు ఏమాత్రం సాయం చేయడం లేదని ఆయన ఆరోపించారు.
ముందుగా ప్లాన్ చేసి ఉంటే...
పునరావాస కేంద్రాల్లోనూ సరైన వసతులు లేవన్నారు. ముందుగా ప్రభుత్వం సన్నద్ధం కాలేదన్నారు. పర్యవేక్షణ లోపంతోనే వరద ఇన్ని గ్రామాలకు చేరిందని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మంచినీరు, ఆహారాన్ని అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమయిందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం పునరావాస కాలనీలను పూర్తి చేసి ఉంటే చాలా వరకూ ఈ కష్టాలు తప్పేవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బాధితులను ప్రభుత్వం వదిలేసినా ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి బాధితులను ఆదుకుంటామని తెలిపారు.