2023 పెనుమార్పులకు నాంది : చంద్రబాబు

2023 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో పెనుమార్పులకు నాంది కాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2022-12-31 06:15 GMT

2023 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో పెనుమార్పులకు నాంది కాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోవూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో విధ్వంసకరమైన పాలన సాగుతుందన్నారు. పోలీసుల అండ చూసుకుని వైసీపీ రౌడీమూకలు చెలరేగి పోతున్నాయని తెలిపారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు.

ట్రైసిటీలుగా....
తన సభలకు ఎప్పుుడూ లేనంత జనం వస్తున్నారని, ప్రభుత్వంపై వ్యతిరేకతే ఇందుకు కారణమని అన్నారు. ధరలు, పన్నులతో ప్రజలను పీడిస్తున్నారని అన్నారు. అయితే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం లబ్ది పొందడానికి ప్రయత్నిస్తుందన్నారు. నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో క్రమశిక్షణారాహిత్యంతో కొన్ని తప్పులు జరిగాయని, అధికార పార్టీ అరాచకాలు కూడా అపజయానికి దోహదపడ్డాయని చంద్రబాబు అన్నారు. నెల్లూరు, తిరుపతి, చెన్నై నగరాలను ట్రై సిటీలుగా మార్చాలని తాను ప్రయత్నించాలనుకున్నానని చంద్రబాబు అన్నారు. తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ తాను ఉంటానని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News