Chandrababu : చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఇదే

ఈనెల 27 నుంచి 31 వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు

Update: 2024-03-24 07:43 GMT

ఈనెల 27 నుంచి 31 వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయింది. ఈనెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు గ్రామీణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 28న రాప్తాడు, శింగనమల, కదిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈనెల 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

రేపు కుప్పంలో...
ఈనెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈనెల 30న సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈనెల 31న కావలి, మార్కాపురంలో పర్యటిస్తారు. ఈనెల 31న సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News