Chandrababu : నేడు మూడు నియోజకవర్గాల్లో బాబు బహిరంగ సభలు

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రజాగళం పేరిట ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు

Update: 2024-03-30 02:22 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రజాగళం పేరిట ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నేడు నాయుడుపేటకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నారు. అనంతరం హెలికాప్టర్ లో కడప జిల్లాకు బయలుదేరుతారు. అక్కడ ఉదయం పదకొండు గంటలకు ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.

తిరుపతి, కడప జిల్లాల్లో...
అనంతరం మధ్యాహ్నం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చేరుకుంటారు. బేరి వీధి సర్కిల్ వద్ద జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. వరసగా మూడు సభల్లో ఆయన పాల్గొననుండటంతో జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఆయన చిత్తూరు జిల్లా నుంచి ప్రజాగళం పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News