TDP : టీడీపీ నుంచి కీలక నేత అవుట్
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వేళ భారీ షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీనియర్ నేత పార్టీని వీడి వెళ్లిపోయారు
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వేళ భారీ షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీనియర్ నేత పార్టీని వీడి వెళ్లిపోయారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మతోన్మాద శక్తులతో టీడీపీ చేతులు కలపడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని ఆయన అన్నారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.
కాంగ్రెస్ హయాంలో...
అరకు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ నుంచి గతంలో గెలిచిన కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీ హయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత 2014లో ఆయన టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అధికారం కోసం తన ఆత్మను చంపుకోలేనని ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో పట్టున్న నేత టీడీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురుదెబ్బేనని చెప్పుకోవాలి.