అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోప్రకటించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పేరును ప్రకటించారు. అలాగే తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంచర్ల శ్రీనివాస్ పేరును ఖరారు చేశారు.
విశాఖ ఎమ్మెల్సీ మాత్రం...
ఇక విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అక్కడ అభ్యర్థిని స్థానిక నేతలే నిర్ణయిస్తారని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే ఆ అభ్యర్థిపై కూడా స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటారని, దానికి మద్దతిచ్చే అవకాశమున్నందున దానిని పెండింగ్ లో పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.