మేం అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతాం : చంద్రబాబు

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారంపై 'బాదుడే బాదుడు' పేరుతో ఇంటింటి..

Update: 2022-04-04 10:58 GMT

ఉండవల్లి : టిడిపి అధినేత చంద్రబాబు ఏపీలో తాజా రాజకీయ, రాష్ట్ర పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చించారు. సీఎం జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో కొత్త జిల్లాల విషయం గురించి మాట్లాడుతూ.. కొత్తజిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని, ఇది రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారంపై 'బాదుడే బాదుడు' పేరుతో ఇంటింటి ప్రచారం చేస్తామని తెలిపారు. కరెంటు కోతలు ఎందుకు విధిస్తున్నారో.. బిల్లులు ఎందుకు పెరిగాయో సీఎం జగన్ చెప్పాలని నిలదీశారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే ప్రజలపై తీవ్రభారం మోపారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే నంబర్ 2 మద్యాన్ని అమ్ముతున్నారన్నారు. కల్తీ మద్యం, జె-ట్యాక్స్ పై పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు.



Tags:    

Similar News