ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు రివ్యూ

టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష చేశారు. ఆయన పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నేతలతో మాట్లాడుతున్నారు

Update: 2023-03-13 06:05 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష చేస్తున్నారు. ఆయన పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నేతలతో మాట్లాడుతున్నారు. పోలింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ దౌర్జన్యాలతో పాటు టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌ల విషయం కూడా నేతలు చంద్రబాబుకు చెపపారు. ఉదయం నుంచి జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కడప ఎస్పీ, తిరుపతి జిల్లా ఎస్సీలతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లతో కూడా చంద్రబాబు మాట్లాడారు.

ఎస్పీలు, కలెక్టర్లతో...
ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని చంద్రబాబు అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సుల్లో దించి అధికార పార్టీ దొంగ ఓట్లు పోలింగ్ చేయిస్తుందని ఆయన ఆరోపించారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. రాజకీయ పక్షాల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బోగస్ ఓట్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలను ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో పాల్గొన్న టీడీడీ ముఖ్యనేతలు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, టీడీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News