Chandrababu : జగన్ ను గెలిపిస్తే అరాచకమే.. మరోసారి గెలిస్తే ఏమీ మిగల్చడు
జగన్ కు మరోసారి అధికారమిస్తే ఇక రాష్ట్రాన్ని మరింత నాశనం చేస్తాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
జగన్ కు మరోసారి అధికారమిస్తే ఇక రాష్ట్రాన్ని మరింత నాశనం చేస్తాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పాయకరావుపేట ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. విశాఖపట్నాన్ని తాను ఐటీ హబ్ గా చేయాలని చూస్తే, జగన్ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చేశాడన్నారు. కరోనా సమయంలో మాస్క్‌లు ఇవ్వడం లేదని అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను అవమానించారని, అతడు ఆత్మహత్యచేసుకునేలా ప్రేరిపించింది ఈ జగన్ ప్భుత్వమేనని ఆయన అన్నారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని, ఎవరూ నమ్మకండి అని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను రద్దు చేసి, చివరకు చెత్తపై కూడా పన్ను వేశారన్నారు.
తాము అధికారంలోకి వస్తే...
రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్ కు భారతరత్న రావడానికి ఎన్టీఆర్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. జగన్ వస్తే మళ్లీ గంజాయి వస్తుంది తప్ప, జాబులు రావన్నారు. రుషికొండను బోడికొండగా మార్చి ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ ను నిర్మించుకున్నాడని చంద్రబాబు ఆరోపించారు. పేదలను మాత్రం జగన్ పట్టించుకోలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. ఈ సారి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో జగన్ కు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. అనకాపల్లి వైసీపీ అభ్యర్థి ఢిల్లీ వీధులు చూడాలంటే పన్నెండేళ్లు పడుతుందని, అదే సీఎం రమేష్ అయితే ఢిల్లీలో ఆయనకు పరిచయాలున్నాయని, ఆయనకు ఓటేయాలనికోరారు.