కర్ణాటక కాంట్రాక్టర్లను కాపు బెదిరించారు
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అవినీతి రాష్ట్ర సరిహద్దులు దాటిందన్నారు. తుంగభద్ర రిజర్వాయర్ కింద హెచ్ఎల్సీ, ఎల్లెల్సీ కాల్వల ఆధునికీకరణ పనులను చేస్తున్న కాంట్రాక్టర్లను కాపు రామచంద్రారెడ్డి బెదిరిస్తున్నారన్నారు. కర్ణాటకలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకునేందుకు ఆయన బెదిరింపులకు దిగుతున్నారని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.
కాల్వల మరమ్మతులకు...
మూడేళ్లుగా రాయదుర్గం పరిధిలోని సహజ వనరులను కాపు రామచంద్రారెడ్డి దోచుకుంటున్నారన్నారు. పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లను బెదిరించడం కూడా ఆయన అవినీతి పరాకాష్టకు చేరిందనడానికి నిదర్శమని చెప్పారు. రాష్ట్ర పరిధిలోని హెచ్‌ఎల్సీ కాలవలకు మరమ్మతులు చేయించకుండా, పక్క రాష్ట్రంలో దోచుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. మూడేళ్ల నుంచి కనీసం కాల్వలకు రిపేర్లు కూడా చేయించలేదని చెప్పారు.