రాష్ట్రపతిని కలిసిన నారా లోకేష్

టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు

Update: 2023-09-26 11:43 GMT

టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి మూర్ముని నారా లోకేష్ కలిశారు. ఆయనతో పాటూ టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేశారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం బురదజల్లే లక్ష్యంతో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని, ఆధారాలను రాష్ట్రపతికి అందించారు.

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంటు కేసులో అరెస్టయి, బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. నారా లోకేశ్ ఢిల్లీలో ఉంటూ ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా మద్దతు కూడబెడుతూ ఉన్నారు. స్కిల్ వ్యవహారంలో ఇప్పటికే జాతీయ మీడియా ముందు నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వివిధ పార్టీల నాయకులను కలుస్తూ ఉన్నారు నారా లోకేష్.


Tags:    

Similar News