వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే: టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని తెలుగుదేశం నాయకులు

Update: 2023-05-23 03:13 GMT

ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని తెలుగుదేశం నాయకులు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆశయాలను తమ పార్టీ నాయకత్వం అనుసరిస్తుందని చెప్పారు. సోమవారం సాయంత్రం తెలుగు దేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం మినీ మహానాడులో ఈ ప్రకటన చేశారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలకు, నారా లోకేష్ యువగళం పాదయాత్రకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపైనా, ఆయన ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు.

రాష్ట్రానికి రూ. 2.75 లక్షల కోట్ల బడ్జెట్‌పై రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి జవాబుదారీగా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్ మొత్తాలను ఎక్కడ ఖర్చు చేశారో సీఎం వెల్లడించాలని అన్నారు. జగన్ రెడ్డి తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లాడుతూ.. జగన్ రాష్ట్రంలో పోలీస్ రాజ్‌ను ప్రవేశపెట్టారన్నారు.పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలను వైఎస్సార్‌సీపీ నేతలు వేధిస్తున్నారన్నారు. ఇప్పుడు జగన్‌రెడ్డి ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందో అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే పరిస్థితిలో ఉండేదన్నారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ.. జగన్‌ బంధువులకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా హైదరాబాద్‌, బెంగళూరు వెళ్లేవారని, అయితే ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి కర్నూలు ఆస్పత్రిలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ఎంత దుర్మార్గుడో, ఎంత కిరాతకుడో అందరికీ తెలుసన్నారు. సొంత చిన్నాన్నను చంపించినవాడిని అరెస్టు చేయకుండా కాపాడుతున్నాడన్నారు. నాయకులు ఎన్టీఆర్, వరుపాలరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఎస్వీఎస్ఎన్ వర్మ, వనమాడి వెంకటేశ్వర్లు, పిల్లి అనంతలక్ష్మి, మాజీ మేయర్ ఎస్ పావని పాల్గొన్నారు.

Tags:    

Similar News