పెగాసస్ పై చర్చ వద్దు.. స్పీకర్ కు టీడీపీ లేఖ
పెగాసస్ అంశంపై శాసనసభలో చర్చ జరవద్దంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు.
పెగాసస్ అంశంపై శాసనసభలో చర్చ జరవద్దంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. పెగాసస్ ను ఏపీ కొనుగోలు చేయలేదని గతంలో డీజీపీ చెప్పిన విషయాన్ని టీడీపీ సభ్యులు లేఖలో స్పష్టం చేశారు. లోక్ సభలో పెగాసస్ అంశంపై చర్చ జరగకూడదని గతంలో విజయసాయిరెడ్డి చెప్పిన విషయాన్ని కూడా వారు గుర్తు చేశారు. పెగాసస్ అంశం ఈ సభలోనూ చర్చించాల్సిన అవసరం లేదని, అందుకు అనుమతి ఇవ్వవద్దని కోరారు.
సభ ప్రారంభంకాగానే.....
ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే పెగాసస్ అంశంపై చర్చ జరపాలని వైసీపీ నోటీసు ఇచ్చింది. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చ జరుపుదామని స్పీకర్ ప్రకటించారు. దీంతో స్పీకర్ కు తెలుగుదేశం పార్టీ సభ్యులు లేఖ రాశారు. పెగాసస్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని కూడా వారు తెలిపారు.