టీడీపీ సభ్యుల యాటిట్యూడ్ బాగాలేదు... స్పీకర్ ఆగ్రహం

మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు

Update: 2022-03-11 05:38 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. రన్నింగ్ కామెంట్రీ చేశారు. పథకాలకు కేటాయింపులు జరుపుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలంటూ కామెంట్స్ చేశారు.

అవాస్తవాలంటూ....
అవాస్తవాలయితే బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడాలని తమ్మినేని సీతారాం కోరారు. టీడీపీ సభ్యుల యాటిట్యూడ్ బాగా లేదని స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కొంత గందరగోళం నెలకొంది. ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నామని స్పీకర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులకు బడ్జెట్ ను వినడం ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కోరారు.


Tags:    

Similar News