సీమెన్స్ పై ఆరోపణలు నిరాధారమే : పయ్యావుల
స్కిల్ డెవలప్ మెంట్ పై వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు
స్కిల్ డెవలప్ మెంట్ పై వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని దుష్ప్రచారానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదని కేశవ్ హెచ్చరించారు. సీమెన్ కంపెనీపై వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్న పయ్యావుల కేశవ్ గుజరాత్, తమిళనాడుతోనూ అనేక ఒప్పందాలు జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మేస్తారా? అంటూ నిలదీశారు. సీఐడీ పోలీసులు బలవంతంగా సంతకాలు చేయిస్తే కోర్టులో నిలుస్తాయా? అంటూ ప్రశ్నించారు.
గుజరాత్ లో బాగా పనిచేసిందనే...
సీమెన్స్ కంపెనీ గుజరాత్ లో బాగా పనిచేసిందనే ఏపీలో ప్రోత్సహించామన్న పయ్యావుల కేశవ్ నిరాధార ఆరోపణలు చేస్తే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఏ పరిస్థితిలో డబ్బు రిలీజ్ చేశామో ప్రేమ్ చంద్రారెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. ఒప్పందానికి ముందు కేంద్రప్రభుత్వ సంస్థతో వాల్యూయేషన్ చేయించారన్నారు. అధికారులు చేసే ప్రతి పని నియమాలకు అనుగుణంగానే ఉంటుందన్నారు. సిమెన్స్ విషయంలో చంద్రబాబుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు.