మండలి ఛైర్మన్ టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ
ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం మద్యంపై చర్చ జరపాలని టీడీపీ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ కు లేఖ రాశారు
ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం మద్యంపై చర్చ జరపాలని టీడీపీ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ కు లేఖ రాశారు. ఏపీలో సరఫరా అవుతున్న మద్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. మద్యం నాణ్యతపై కూడా సభలో చర్చ జరపాలని ఎమ్మెల్సీలు లేఖలో కోరారు. జే బ్రాండ్ మద్యం కారణంగానే ఏపీలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, ఉభయ సభల్లో చర్చ జరిగితేనే దీనికి ఒక ముగింపు లభిస్తుందని వారు లేఖలో పేర్కొన్నారు.
ల్యాబ్ రిపోర్టు జత చేసి....
ఒక్క జంగారెడ్డి గూడెంలోనే వారం రోజుల వ్యవధిలో 28 మంది నాటుసారా తాగి మరణించారని లేఖలో తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నందునే ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మద్యం ద్వారానే ఆదాయం రావాలని భావించడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. నాటుసారా మరణాలకు సంబంధించి ల్యాబ్ రిపోర్టును కూడా టీడీపీ ఎమ్మెల్సీలు జత చేశారు.