స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై లోక్ సభలో టీడీపీ?
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కోరారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ లాభాల బాటలో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం తగదన్నారు. ప్రయివేటీకరణకు తాము వంద శాతం వ్యతిరేకమని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
భూములిచ్చిన వారికి....
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో మంది భూములు ఇచ్చారని, వారి కుటుంబాలకు ప్లాంట్ లో ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయివేటీకరణ చేస్తే అది సాధ్యం కాదని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. అందుకే ప్రయివేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని లోక్ సభలో రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.