కిమ్ ను మించిపోయిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శ చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శ చేశారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనకు తానే ప్రకటించుకున్నాడని అన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు నియంత కిమ్ ను జగన్ మించి పోయాయడని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి అని కలలు కంటున్నారేమో అని లోకేష్ ఎద్దేవా చేశారు.
పయ్యావుల భద్రత తొలగింపుపై...
వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేశారనే అక్కసుతో పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందన్నారు. జగన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాదాన్ని గణాంకాలతో సహా వెల్లడించిన పయ్యావుల కేశవ్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. అదనపు భద్రత కావాలని కోరితే, ఉన్న సెక్యూరిటీని తొలగించారంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకున్నట్లేనని, తక్షణమే పయ్యావుల కేశవ్ కు అదనపు భద్రతను కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు.