ఏపీ గవర్నర్ కు నారా లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏయూ వర్సిటీ వైస్ ఛాన్సిలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని కోరారు. వీసీ వద్దంటూ పెద్దయెత్తున విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని నారా లోకేష్ తెలిపారు.
అక్రమాలకు అడ్డాగా....
ఆంధ్ర యూనివర్సిటీ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలోనే వైసీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం స్టేషనరీ, ప్రింటింగ్ వ్యవహారాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని నారా లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన వారిని కూడా నిబంధనలకు విరుద్ధంగా తిరిగి రీ ఎంప్లాయిమెంట్ పేరిట విధుల్లోకి తీసుకుంటున్నారని నారా లోకేష్ ఆరోపించారు.