లోకేష్ అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

Update: 2023-09-16 12:25 GMT

సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై లోకేశ్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారన్న విషయాన్ని పార్లమెంటులో బలంగా వినిపించాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులను ఉభయసభల దృష్టికి తీసుకెళ్లేలా టీడీపీ ఎంపీల కార్యాచరణ ఉండాలని సూచించారు.

వైసీపీని వ్యతిరేకించే పార్టీలు టీడీపీ-జనసేనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు నారా లోకేష్. ఢిల్లీలో మాట్లాడుతూ ఉంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమతో కలిసి వచ్చే ప్రతి పార్టీకి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో విజయం తమదేనని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే ఢిల్లీ వచ్చినట్టు తెలిపారు. అనినీతి పరులు నీతిపరులను జైలుకు పంపుతున్నారన్నారు. ‘స్కిల్‌ డెవలప్‌మెంట్’ అంశంలో అవినీతి నిరూపించలేకపోయారని.. చంద్రబాబుకు డబ్బు అందిందని నిరూపించలేకపోయారని అంటున్నారు. ఎలాంటి స్కామ్‌ జరగలేదని నేను నిరూపించగలను. అన్ని పత్రాలు చూపించి అవినీతి జరగలేదని నిరూపిస్తానన్నారు నారా లోకేష్.


Tags:    

Similar News