రాక్షస పాలన విముక్తి కోసం పూజలు చేయండి
ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నట్లు తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తెలుగు ప్రజలకు ఆయన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. పురాణాల్లో దేవతలంతా ఇదే రోజు శ్రీమన్నారాయణుని వద్దకు వచ్చి ఆయన అనుగ్రహం పొంది రాక్షస పీడను వదిలించుకున్నారని లోకేష్ ట్వీట్ చేశారు.
రాష్ట్రానికి....
అలాగే ఈరోజు రాష్ట్రానికి పట్టిన రాక్షస పాలన నుంచి త్వరగా విముక్తి పొందాలని భగవంతుడిని వేడుకుందామని లోకేష్ ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని, సకల శుభాలు చేకూరాలని కోరుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు.