లోకేష్ ట్వీట్... ఏపీపై?
ఆంధ్రప్రదేశ్ లో ఎమెర్జెన్సీ నడుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమెర్జెన్సీ నడుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విజయవాడలో విద్యార్థులపై పోలీసుల నిర్భంధ చర్యను ఆయన ఖండించారు. చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు జులుం దుర్మార్గమని, ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర పరిస్థితిని ఏమైనా ప్రకటించారా? అని ట్వీట్ చేశారు.
ఎమెర్జెన్సీని తలపిస్తూ...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో అరస్టయిన చంద్రబాబుకు మద్దతుగా విద్యార్థులు ఎటువంటి నిరసనలు, ర్యాలు చేయకుండా విజయవాడ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇ:దులో భాగంగా కళాశాలలోకి వెళ్లి విద్యార్థులకు స్మూత్ గా వార్మింగ్ ఇచ్చారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ సిద్ధార్థ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పోలీసులు ప్రవేశించడాన్ని తప్పు పట్టారు. ఇది ఎమెర్జెన్సీని తలపిస్తుందన్నారు. కళాశాలలకు సెలవులు ప్రకటించడానికి సైకో జగన్ ఆదేశాలే కారణమని ఆయన తన ట్వీట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.