జగన్ కు లోకేష్ లేఖ.. వాటిని తిరిగి ఇవ్వకపోతే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు

Update: 2021-11-30 07:45 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పంచాయతీలకు వెంటనే నిధులను కేటాయించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నుంచి మళ్లించిన 1,309 కోట్ల రూపాయల నిధులను తిరిగి పంచాయతీలకు ఇవ్వాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. 14, 15 ఆర్థిక సంఘం పంచాయతీలకు విడుదల చేసిన నిధులను దోపిడి దొంగల్లా దోచుకు పోతున్నారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

పంచాయతీ నిధులను...
నాలుగు నెలల క్రితం విద్యుత్ బకాయీల కింద 344 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుందని లోకేష్ ఆరోపించారు. నిధుల మళ్లింపుపై ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్రామాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని లోకేష్ మండి పడ్డారు. మళ్లించిన నిధులను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడతామని లోకేష్ హెచ్చరించారు.


Tags:    

Similar News