Nara Lokesh : మూడోసారి లోకేష్ కాన్వాయ్ తనిఖీ

ఉండవల్లి కరకట్ట వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్‌ను ఆపి పోలీసులు తనిఖీ చేశారు;

Update: 2024-03-24 03:34 GMT
Nara Lokesh : మూడోసారి లోకేష్ కాన్వాయ్ తనిఖీ
  • whatsapp icon

ఉండవల్లి కరకట్ట వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్‌ను ఆపి పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి పోలీసులు చెప్పడంతో వారి సోదాలకు నారా లోకేష్ సహకరించారు. లోకేష్ కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు తనిఖీ చేశారు.

ప్రచారానికి వెళుతుండగా...
తాడేపల్లి టౌన్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ఆపి పోలీసులు ఈ తనిఖీలను నిర్వహించారు. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించడంతో ఆయన కాన్వాయ్ ప్రచారానికి బయలుదేరి వెళ్లింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటికి మూడు సార్లు లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు చెక్ చేశారు.


Tags:    

Similar News