టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది.చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు

Update: 2021-11-26 03:18 GMT

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వరద సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యంతో పాటు ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించనున్నారు.

కీలక అంశాలపై....
మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటి స్థానంలో కొత్త బిల్లును తెస్తామని ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై కూడా సమావేశంలో చర్చించి రాజధాని అంశంపై ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై చంద్రబాబు నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. వరద సహాయ కార్యక్రమాలు, వరదల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం పై ఆందోళన కార్యక్రమాలపై కార్యాచరణను రూపొందించనున్నారు.


Tags:    

Similar News