జగన్ రెడ్డీ.. జాబ్ క్యాలెండర్ ఏదీ?
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారని యనమల ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలనలో యువతకు ఉపాధి ఒక డొల్లగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో అరిస్ట్రోక్రాటిక్ పాలన నడుస్తుందన్నారు. యువత జగన్ రెడ్డిని నిలదీయాలని యనమల పిలుపు నిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చే పెట్టుబడులు ఏమీ లేవని, ఉద్యోగాలు లేవని ఆయన అన్నారు. వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కు వెళ్లిపోయాయని యనమల మండి పడ్డారు. కమీషన్ల కోసం ఉన్న పరిశ్రమలను కూడా వెనక్కు పంపారని చెప్పారు.
నిరుద్యోగులకు...
వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి లేకుండా పోయిందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల ఆరు లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చిందని, ఈ ప్రభుత్వం వచ్చాక దాని ఊసే మరచి పోయిందన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీలకు కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని యనమల గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎంఐఈ నివేదిక ప్రకారం గ్రాడ్యుయేషన్ ఆన్ ఎంప్లాయిమెంట్ రేటు 33.6 శాతానికి పెరిగిందన్నారు. నవ్యాంధ్ర నవనాడులను నలుచుకుతింటున్న ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని యనమల రామకృష్ణుడు పిలుపు నిచ్చారు.