కోర్టులు చూస్తూ ఊరుకోవు

న్యాయస్థానాల పట్ల ప్రభుత్వం బెదిరింపులు సరికాదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు

Update: 2022-03-27 12:06 GMT

న్యాయస్థానాల పట్ల ప్రభుత్వం బెదిరింపులు సరికాదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. కోర్టులు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. కోర్టు తీర్పులపై అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పి ప్రజలను తప్పదోవ పట్టించవద్దని ఆయన కోరారు. చట్ట ప్రకారమే పార్లమెంటులో పునర్విభజన చట్టం చేశారని, దానిని అనుసరించే అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

రాజ్యాంగాన్ని మారుస్తామంటే?
పార్టీలు మారినంత మాత్రాన రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. రాజధానిని మార్చే హక్కు ఉందని కేంద్రం చెప్పిందని వైసీపీ నేతలు చెబుతున్నారని, కానీ కేంద్రం సుప్రీంకాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటే దానిని పరిరక్షించే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఆయన అన్నారు. చట్టాలను మార్చే అధికారం కేవలం పార్లమెంటుకే ఉంటుందని చెప్పారు.


Tags:    

Similar News